గుండెలు పిండే ఘటన: అమ్మను చూడాలని.. ఆసుపత్రి గది కిటికీపైకి ఎక్కి..
- పాలస్తీనాలో ఘటన
- సోషల్ మీడియాతో కంటతడి పెట్టిస్తున్న ఫొటో
- ట్విట్టర్లో షేర్ చేసిన ఐక్యరాజ్య సమితిలో శాశ్వత ప్రతినిధి మహ్మద్ సఫా
పాలస్తీనాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ చూసిన వారి హృదయాలను పిండేస్తోంది. ఆసుపత్రి గది కిటికీపైకి ఎక్కి తల్లిని చూసుకున్న ఆ కుమారుడి పేరు జిహాద్ అల్-సువైటి. ఐక్యరాజ్య సమితిలో శాశ్వత ప్రతినిధి మహ్మద్ సఫా ఈ ఫొటోను తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు.