కరోనా లేని దేశాలు ఇవే... అధికారికంగా గుర్తించిన అమెరికా
- అనేక దేశాల్లో బీభత్సం సృష్టిస్తున్న కరోనా
- పసిఫిక్ ద్వీప దేశాల్లో ఆచూకీ లేని మహమ్మారి
- ముందే మేల్కొని చైనాతో సరిహద్దులు మూసేసిన ఉత్తర కొరియా
ఆ దేశాలు ఇవే..
- సోలోమన్ ఐలాండ్స్
- వనెవాటు
- మైక్రోనేషియా దీవుల సమాఖ్య
- మార్షల్ దీవులు
- పలావ్
- తువాలు
- ఉత్తర కొరియా
- నౌరు
- తుర్క్ మెనిస్థాన్
- సమోవా
- కిరిబాటి
- టోంగా
తుర్క్ మెనిస్థాన్ విషయానికొస్తే ఆరంభంలోనే చైనాకు విమానాలు రద్దు చేసింది. అన్ని దేశాలతో ఉన్న సరిహద్దులు మూసేసి తన ప్రజలను రక్షించుకుంది.
ముఖ్యంగా చెప్పుకోవాల్సింది పసిఫిక్ ద్వీప దేశాల గురించే. విదేశాల నుంచి వచ్చేవారికి ఈ దేశాలు కఠిన నిబంధనలు అమలు చేశాయి. కచ్చితంగా 14 రోజుల క్వారంటైన్ పూర్తి చేసుకోవడం, ఆపై డాక్టర్ సర్టిఫికెట్ ఉంటేనే అనుమతి వంటి నిబంధనలతో కరోనాను ఆమడదూరం పెట్టాయి. ప్రధానంగా అంతర్జాతీయ విమాన సర్వీసులను నిలిపివేయడం ఈ దేశాలను వైరస్ కు దూరంగా నిలిపింది. ఈ పసిఫిక్ ద్వీపదేశాల్లో జనాభా తక్కువగా ఉండడం కూడా అక్కడి ప్రభుత్వాలకు సేవలు అందించేందుకు సులువుగా మారింది.