ఒడిశా తీరంలో అరుదైన పసుపు రంగు తాబేలు దర్శనం
- గ్రామస్తులకు దొరికిన తాబేలు
- అటవీ అధికారులకు అప్పగించిన గ్రామస్థులు
- జన్యులోపంతో పుట్టిన తాబేలు అయ్యుంటుందన్న నిపుణులు
దీని ఫొటోలను సోషల్ మీడియాలో చూసిన ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ అధికారి సుశాంత నందా ఇది ఒక అల్బినో (జన్యులోపంతో సహజ వర్ణం కోల్పోయిన జీవి) అని పేర్కొన్నారు. ఇలాంటిదే సింధ్ ప్రాంతంలో కొన్నేళ్ల కిందట కనిపించిందని తెలిపారు. ఈ పసుపు వర్ణం తాబేలుకు కళ్లు గులాబీ రంగులో ఉండడం కూడా జన్యుపరమైన లోపమేనని వివరించారు.