భార్య ఉపాసనను ప్రశంసిస్తూ.. పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిన రామ్ చరణ్!

Ram Charan wishes upasana
  • తన భార్య ఫొటో పోస్ట్ చేసిన చెర్రీ
  • దయ చూపుతూ ఆమె మంచి పనులు చేస్తోందని వ్యాఖ్య
  • అవి ఎంత చిన్నవైనా సరే అవి ఎన్నటికీ వృథాకావని ప్రశంసలు
తన భార్య ఉపాసన పుట్టినరోజు సందర్భంగా సినీనటుడు రామ్ చరణ్ తేజ్ ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతూ ఆమె ఫొటోను పోస్ట్ చేశాడు. 'ఇతరులపై చాలా దయ చూపుతూ నువ్వు చేసే పనులు ఎంత చిన్నవైనా సరే అవి ఎన్నటికీ వృథాకావు. నీ మంచి పనుల్ని ఇలాగే కొనసాగిస్తూ వెళతావని ఆశిస్తున్నాను.. గుర్తింపు దానికదే వస్తుంది. హ్యాపీ బర్త్ డే' అని రామ్ చరణ్ తన ఫేస్‌బుక్ ఖాతాలో పోస్ట్ చేశాడు.

కాగా, ఉపాసన సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ చురుకుగా పాల్గొంటుందన్న విషయం తెలిసిందే. తమ ఆసుపత్రి సిబ్బందితో కలిసి ఉపాసన పలు కార్యక్రమాల్లో పాల్గొంటుంది. చెర్రీకి సంబంధించిన ఫొటోలు, అప్‌డేట్‌లను పోస్ట్ చేస్తూ ఆమె సామాజిక మాధ్యమాల ద్వారా మెగా అభిమానులకు దగ్గరైంది.
Ramcharan
upasana
Tollywood

More Telugu News