చిరంజీవి కొత్త లుక్.. మెగాస్టార్ ఎలా ఉన్నాడో చూశారా..!

కరోనా లాక్ డౌన్ తో విరామం లభించిన సమయంలో టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఓవైపు సీసీసీ ద్వారా సినీ కార్మికులకు అవసరమైన సేవలు అందిస్తూనే, మరోవైపు ఇంటి వద్ద అనేక చిత్రాలను వీక్షిస్తున్నారు. ఈ క్రమంలో యువ నటుడు సత్యదేవ్ నటించిన బ్లఫ్ మాస్టర్ చిత్రాన్ని తిలకించి ముగ్ధులయ్యారు.

అంతేకాదు బ్లఫ్ మాస్టర్ చిత్రదర్శకుడు గోపీ గణేశ్ ను తన నివాసానికి పిలిపించుకుని మనస్ఫూర్తిగా అభినందించారు. ఈ సందర్భంగా చిరంజీవి ఎంతో కొత్తగా కనిపించారు. సాధారణంగా చిరుగడ్డం, మీసాలతో దర్శనమిచ్చే మెగాస్టార్... యువ దర్శకుడు గోపీ గణేశ్ తో ఫొటోలో మీసాల్లేకుండా దర్శనమిచ్చారు.

Chiranjeevi
Megastar
New Look
Gopi Ganesh
Bluffmaster

More Telugu News