Election Commission: ఎన్నికల నిర్వహణపై రాజకీయ పార్టీల అభిప్రాయాలు కోరిన ఎన్నికల సంఘం

Election Commission of India has asked national and regional political parties
  • ఎన్నికల ప్రచారాలు, సమావేశాలను ఎలా నిర్వహించుకోవచ్చు?
  • జాతీయ, ప్రాంతీయ పార్టీలు అభిప్రాయాలు చెప్పాలి
  • ఈ నెల 31 వరకు సమయం: ఈసీ
దేశంలో కరోనా వైరస్‌ విజృంభణ నేపథ్యంలో పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ అంశంపై సందిగ్ధత నెలకొన్న విషయం తెలిసిందే. దీనిపై ఎన్నికల కమిషన్‌ సమాలోచనలు చేస్తోంది. ఈ క్రమంలో ఎన్నికల ప్రచారాలు, సమావేశాలను ఎలా నిర్వహించుకోవాలన్న అంశాలపై అభిప్రాయాలు తెలపాలని జాతీయ, ప్రాంతీయ పార్టీలను ఎన్నికల సంఘం కోరింది. తమ అభిప్రాయాలను పంపేందుకు ఈ నెల 31 వరకు సమయం ఇస్తున్నట్లు తెలిపింది.

కాగా, కరోనా విజృంభణ నేపథ్యంలో ఎన్నికల నిర్వహణ సవాలుగా మారింది. బీహార్ అసెంబ్లీ ఎన్నికలు ఈ ఏడాది అక్టోబరులో జరగాల్సి ఉండగా, ఎన్నికల కమిషన్ ఆ రాష్ట్రంలోని పార్టీలతో ఇప్పటికే వర్చువల్ సమావేశం నిర్వహించింది. అలాగే, కరోనా రోగులకు పోస్టల్ బ్యాలెట్ పధ్ధతిలో ఓటు వేసే అవకాశాన్ని కల్పించింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో బీజేపీ సహా పలు పార్టీలు వర్చువల్ పద్ధతిలోనే సమావేశాలు నిర్వహిస్తున్నాయి.
Election Commission
India

More Telugu News