ugc: డిగ్రీ పరీక్షలు నిర్వహిస్తాం: యూజీసీ ఆదేశాలపై వర్సిటీలు

universities on ugc guideline
షార్ట్స్‌లో చూడండి
కరోనా వ్యాప్తి నేపథ్యంలోనూ దేశ వ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీల్లో యూజీ, పీజీ చివరి సంవత్సర పరీక్షలు తప్పనిసరి చేస్తూ ఇటీవల  యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌(యూజీసీ) విధి విధానాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. యూజీసీ చేసిన ప్రకటనపై దేశంలోని యూనివర్సిటీలు సానుకూలంగా స్పందించాయి.

దేశంలోని 755 యూనివర్సిటీల్లో ఇప్పటికీ పరీక్షలు నిర్వహించని 366 వర్సిటీలు త్వరలో పరీక్షలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ విషయాన్ని యూజీసీకి వర్సిటీలు తెలిపాయి. కాగా ఇప్పటికే 194 యూనివర్సిటీలు ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌లో పరీక్షలు నిర్వహించాయి.

కాగా, యూజీసీ మార్గదర్శకాలను అనుసరించి ఏపీలోని ఉభయగోదావరి జిల్లాల్లోని ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం అనుబంధ కాలేజీల్లో డిగ్రీ చివరి ఏడాది విద్యార్థులకు ఆగస్టులో పరీక్షలు నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు ప్రకటించింది.

భౌతిక దూరం, మాస్కుల ధారణ, శానిటైజర్లు వాడకం, ధర్మల్‌ స్క్రీనింగ్ వంటి నిబంధనలు పాటిస్తూ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపింది. ఈ పరీక్ష ఫలితాలు సెప్టెంబరులో విడుదల చేస్తారు. ఇప్పటికే పరీక్ష తేదీలు వెల్లడించి పరీక్షలను వాయిదా వేసిన వర్సిటీలు కూడా మళ్లీ పరీక్షల టైమ్‌టేబుల్ విడుదల చేయడానికి ప్రణాళికలు వేసుకుంటున్నాయి.
Go Back to Shorts
ugc
India
Corona Virus

More Telugu News