అత్యంత నిరాడంబరంగా బ్రిటన్ యువరాణి వివాహం!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అత్యంత నిరాడంబరంగా బ్రిటన్ యువరాణి వివాహం!

Britain Princess Marriage
  • ఎడోర్డో మేపిలీ మోజీతో వివాహం
  • రాయల్ చాపెల్ ఆఫ్ ఆల్ సెయింట్స్ లో వివాహం
  • వెల్లడించిన రాజ కుటుంబం
బ్రిటన్ ప్రిన్స్ ఆండ్రూ పెద్ద కుమార్తె, రాణి ఎలిజబెత్-2 మనవరాలు, యువరాణి ప్రిన్సెస్ బీట్రెస్ వివాహం నిన్న ఇటలీకి చెందిన వ్యాపారవేత్త ఎడోర్డో మేపిలీ మోజీతో నిరాడంబరంగా జరిగింది. బీట్రెస్ వయసు 31 సంవత్సరాలు కాగా, మొజ్జిని వయసు 37 సంవత్సరాలు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో వీరి పెళ్లి అతి కొద్దిమంది అతిథుల మధ్య సాదాసీదాగా జరిగింది.

ఈ విషయాన్ని వెల్లడించిన బకింగ్ హామ్ ప్యాలెస్ వర్గాలు, కొత్త జంటకు పలువురు రాజ వంశీయులు, రాజకీయ నాయకులు, ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారని పేర్కొంది. కాగా, వీరిద్దరి వివాహం మే 29న లండన్, సెయింట్ జేమ్స్ ప్యాలెస్ లో జరిపించేందుకు పెద్దలు నిశ్చయించగా, కరోనా మహమ్మారి నేపథ్యంలో, అప్పట్లో వారి వివాహం వాయిదా పడింది. దాని తరువాత, మరో తేదీని నిర్ణయించిన పెద్దలు వివాహాన్ని రాయల్ చాపెల్ ఆఫ్ ఆల్ సెయింట్స్ వద్ద నిర్వహించారని, వారిద్దరూ ఒకటయ్యారని రాజ కుటుంబం ఓ ప్రకటనలో వెల్లడించింది.
London
Britain
Marriage

More Telugu News