సొమ్మొకరిది, స్టిక్కర్ మరొకరిది!... తమిళనాడులో నగదు పట్టుబడిన వ్యవహారంలో ఆసక్తికర అంశాలు!
- తమిళనాడులో రూ.5.27 కోట్ల నగదుతో కారు స్వాధీనం
- ఆ సొమ్ము తనదేనన్న ఒంగోలు బంగారం వ్యాపారి
- స్టిక్కర్ తన డ్రైవర్ తీసుకువచ్చాడని వెల్లడి
ఆ డబ్బు తనదేనని, కానీ కారుపై అంటించి ఉన్న ఎమ్మెల్యే స్టిక్కర్ మాత్రం డ్రైవర్ తీసుకువచ్చి అతికించాడని వివరించారు. ఆ స్టిక్కర్ గిద్దలూరు శాసనసభ్యుడు అన్నా రాంబాబు పేరిట ఉందని, అయితే దాని వ్యాలిడిటీ ఎప్పుడో ముగిసిందని అన్నారు. తమ డ్రైవర్ ఆ స్టిక్కర్ ఎలా సంపాదించాడో తెలియదని నల్లమల్లి బాలు స్పష్టం చేశారు. ప్రస్తుతం ఆయన ఒంగోలులో కార్పొరేటర్ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి ఈ బంగారం వ్యాపారి సన్నిహితుడని ప్రచారం జరుగుతోంది.