మీ వద్దకు వచ్చే బిల్లులను నిశితంగా పరిశీలించండి: గవర్నర్ కు యనమల విజ్ఞప్తి
- వికేంద్రీకరణ, సీఆర్డీయే రద్దు బిల్లులు ఆమోదించవద్దని వినతి
- అవసరమైతే అటార్నీ జనరల్ అభిప్రాయం తీసుకోవాలని విజ్ఞప్తి
- గవర్నర్ కు లేఖ రాసిన యనమల
ఆ రెండు బిల్లులను ఏపీ శాసనమండలి సెలెక్ట్ కమిటీకి పంపడంతో రెండోసారి ప్రవేశపెట్టినప్పుడు వాటిని పరిగణనలోకి తీసుకోలేదని యనమల వివరించారు. ఆ బిల్లులు ఇప్పటికీ సెలెక్ట్ కమిటీ వద్దే ఉన్నాయి... అందుకే, మీ వద్దకు వచ్చే బిల్లులను మీరు నిశితంగా పరిశీలించాలి అంటూ గవర్నర్ ను కోరారు. ఈ విషయంలో అవసరమైతే అటార్నీ జనరల్ అభిప్రాయాలను తీసుకోవాలని సూచించారు. ఈ మేరకు గవర్నర్ కు యనమల లేఖ రాశారు.