'సింహాచలం గోశాల నుంచి 50 ఆవులు మాయం' అంటూ వార్తలు... స్పందించిన ఏపీ మంత్రి వెల్లంపల్లి!
- గోవులను పాత గోశాలకు తరలించినట్టు వెల్లడి
- వైద్యుల సూచన మేరకు చర్యలు తీసుకున్నామని వివరణ
- అసత్య ప్రచారం చేస్తే చర్యలుంటాయని హెచ్చరిక
రెండ్రోజుల కిందట గోశాలలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను తొలగించారని, ఆ వెంటనే ఆవులు మాయం అయ్యాయని ప్రచారం జరిగింది. దీనిపై మంత్రి మాట్లాడుతూ, దేవస్థానం పరిపాలన విధానంలో భాగంగా కాంట్రాక్టు ముగిసిన తర్వాత అర్హులైన వారికి మరికొందరికి ఔట్ సోర్సింగ్ ద్వారా అవకాశం ఇవ్వడం జరుగుతుందని స్పష్టం చేశారు. ఇందులో రాజకీయాలకు తావులేదని అన్నారు. అయినా, గోశాల గోడ కూల్చి గోమాతలకు నిలువు నీడ లేకుండా చేసింది చంద్రబాబేనని ఆరోపించారు. జగన్ ప్రభుత్వంలో గోవుల పవిత్రతకు ఎలాంటి భంగం వాటిల్లదని స్పష్టం చేశారు.