మహిళా వాలంటీర్ అంత్యక్రియలను అడ్డుకున్న గ్రామస్తులు!
- మడకశిరలో నిన్న రాత్రి చనిపోయిన వాలంటీర్ నాగలక్ష్మి
- శ్మశానవాటికకు తరలిస్తుండగా అడ్డుకున్న స్థానికులు
- స్థానికులతో గొడవపడ్డ నాగలక్ష్మి బంధువులు
మడకశిరలోని కంటైన్మెంట్ జోన్లలో నాగలక్ష్మి విధులు నిర్వహించింది. ఈ నేపథ్యంలో, కరోనా వల్లే ఆమె చనిపోయిందనే ప్రచారం జరిగింది. నిన్న రాత్రి ఆమె మృతదేహాన్ని శ్మశానవాటికకు తరలిస్తుండగా స్థానిక శివాపురం కాలనీవాసులు అడ్డుకున్నారు. ఇక్కడ అంత్యక్రియలు చేయవద్దని అడ్డుపడ్డారు. దీంతో, వారితో మృతురాలి బంధువులు గొడవకు దిగడంతో, అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని కాలనీ వాసులకు నచ్చచెప్పారు. దీంతో, ఆమె అంత్యక్రియలు పూర్తయ్యాయి.