దిగొచ్చిన ట్రంప్ సర్కారు... విద్యార్థి వీసాలపై నిబంధనల ఎత్తివేత!
- ఆన్ లైన్ విద్యార్థులు దేశం వీడాల్సిందని ఉత్తర్వులు
- కోర్టును ఆశ్రయించిన పలు యూనివర్శిటీలు
- వివాదాస్పద నిర్ణయం వెనక్కి
ఈ నిర్ణయాన్ని వెనక్కు తీసుకునేందుకు ప్రభుత్వం అంగీకరించిందని ఫెడరల్ న్యాయమూర్తి అల్లీసన్ బురోగ్స్ వెల్లడించారు. అంతకుముందు ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను నిలిపివేయాలని పిటిషనర్లు కోర్టును కోరారు. కరోనా మహమ్మారి విస్తరిస్తున్న వేళ, వర్శిటీలను తిరిగి తెరిచే విషయంలో యాజమాన్యాలు ఆచితూచి వ్యవహరించే ధోరణిలో ఉండి, ఆన్ లైన్ క్లాసులను ప్రవేశపెట్టగా, విద్యా సంస్థలపై ఒత్తిడిని పెంచేలా ట్రంప్ ఈ నిర్ణయాన్ని తీసుకున్న సంగతి తెలిసిందే.