సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
- కమల్ సినిమాలో కీర్తి సురేశ్
- వెబ్ సీరీస్ లోకి శ్రీను వైట్ల
- పారితోషికం తగ్గించుకున్న విజయ్
* ఒకప్పుడు వరుస విజయాలను ఇచ్చి, గత కొంతకాలంగా వెనుకపడిపోయిన ప్రముఖ దర్శకుడు శ్రీను వైట్ల త్వరలో వెబ్ సీరీస్ ని డైరెక్ట్ చేయనున్నారు. ఇందుకు సంబంధించి ఓటీటీ ప్లాట్ ఫాంతో ప్రస్తుతం చర్చలు జరుగుతున్నట్టు తెలుస్తోంది.
* తమిళ స్టార్ హీరో విజయ్ హీరోగా మురుగదాస్ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ ఓ భారీ చిత్రాన్ని నిర్మిస్తోంది. ప్రస్తుత కరోనా పరిస్థితులలో సినిమా రంగం నష్టపోయిన నేపథ్యంలో ఈ చిత్రానికి తన పారితోషికాన్ని విజయ్ బాగా తగ్గించుకున్నాడట.