అడవిపక్కన తల్లిని వదిలేసిన కుమారులు.. మూడు రోజులు వర్షంలో తడిచిన తల్లి
- చిత్తూరు జిల్లా పెంగరగుంటలో ఘటన
- ఓ ఆలయం వద్ద కూర్చున్న 90 ఏళ్ల వృద్ధురాలు
- సాయం చేసిన స్థానికులు
- ప్రభుత్వ సంక్షేమ హాస్టల్‌కు తరలింపు
ఆమె మూడు రోజులుగా నీరసించిపోవడంతో కనీసం మాట్లాడలేని పరిస్థితుల్లో ఉంది. ఆమెకు కరోనా సోకిందని అనుమానించి సరిహద్దుల్లోని తమిళనాడు గ్రామం నుంచి ఆమెను ఆమె కుమారులే ఇక్కడ వదిలేశారన్న అనుమానులు వ్యక్తమవుతున్నాయి. పలమనేరు తహసీల్దార్ శ్రీనివాసులు ఆ వృద్ధురాలిని ప్రభుత్వ సంక్షేమ హాస్టల్‌కు తరలించారు. అక్కడ ఆమెకు భోజన సౌకర్యాలు కల్పిస్తున్నారు.