ఇటీవల హత్యకు గురైన చిన్నారి ఆద్య... రైలు కిందపడి తండ్రి ఆత్మహత్య
- చేయని నేరానికి బలైన చిన్నారి ఆద్య
- కుమార్తె మరణంతో మనస్తాపానికి గురైన తండ్రి!
- ఇద్దరు ప్రియులతో వివాహిత అక్రమ సంబంధాలు
కల్యాణ్ యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు (ఎం)లో పంచాయతీ కార్యదర్శిగా ప్రభుత్వోద్యోగం చేస్తున్నాడు. సదరు వివాహిత, కల్యాణ్ ప్రేమవివాహం చేసుకున్నారు. వీరి కాపురంలో ఫేస్ బుక్ స్నేహాలు చిచ్చు రేపాయి. సికింద్రాబాద్ కు చెందిన ఓ యువకుడితో వివాహిత అక్రమ సంబంధం ఏర్పరచుకుంది. అంతేకాదు, ఆ యువకుడు పరిచయం చేసిన మరో యువకుడితోనూ ఇదే తరహా సంబంధం పెట్టుకుంది. దాంతో మొదటి యువకుడు ఆగ్రహంతో రగిలిపోయి ఆమె కుమార్తెను బలిగొన్నాడు.