YSRCP: వైఎస్ఆర్‌ సీపీ గుర్తింపును రద్దు చేయాలంటూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్

Petition filed in Delhi high court on YSRCP name
షార్ట్స్‌లో చూడండి
ఏపీలో అధికార పార్టీ అయిన వైఎస్ఆర్సీపీ గుర్తింపును రద్దు చేయాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ ను అన్నా వైయస్ఆర్ పార్టీ నేత బాషా దాఖలు చేశారు. 'యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ'కి బదులుగా వైయస్ఆర్ అనే పేరును వాడుతున్నారంటూ పిటిషన్ లో ఆయన పేర్కొన్నారు.

మరోవైపు ఇదే పేరుపై ఆ పార్టీ ఎంపీ రఘురామకృష్ణరాజు కూడా ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తనకు వైయస్ఆర్సీపీ పేరుపై ఇచ్చిన షోకాజ్ నోటీసుపై విమర్శలు గుప్పించారు. ఈ పార్టీ పేరుతో తనకు నోటీసులు ఎలా ఇస్తారని ప్రశ్నించారు.
Go Back to Shorts
YSRCP
Delhi High Court
Petition

More Telugu News