పూర్తి డిప్రెషన్‌లో కరణ్ జొహార్.. ఎవరినీ కలవడానికి కూడా ఇష్టపడని వైనం!
- సుశాంత్ మరణంతో కరణ్ పై తీవ్ర విమర్శలు
- పిల్లలను చంపేస్తామని సోషల్ మీడియాలో వార్నింగులు
- కుంగిపోయాడన్న కరణ్ స్నేహితుడు
మరోవైపు... నెపోటిజం అంటేనే బాలీవుడ్ లో అందరికీ గుర్తుకు వచ్చే మొట్టమొదటి పేరు కరణ్ జొహార్. స్టార్ కిడ్స్ ను పెట్టి సినిమాలను తీయడానికి ఈయన అత్యధిక ప్రాధాన్యతను ఇస్తారు. ఈ నేపథ్యంలో సుశాంత్ మరణించిన తర్వాత కరణ్ జొహార్ పై వచ్చినన్ని విమర్శలు మరెవరిపై రాలేదు. సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ కు కరణ్ గురయ్యాడు. అంతేకాదు, కరణ్ కవల పిల్లలను చంపేస్తామని సోషల్ మీడియాలో వార్నింగులు కూడా వస్తున్నాయి.
వీటన్నింటి నేపథ్యంలో, కరణ్ తీవ్ర మనోవేదనకు గురవుతున్నాడు. పూర్తిగా డిప్రెషన్ లోకి జారుకున్నాడు. దీనిపై కరణ్ స్నేహితుడు ఒకరు ఆంగ్ల మీడియాతో మాట్లాడుతూ, సుశాంత్ మరణం తర్వాత కరణ్ కుంగిపోయాడని ఆవేదన వ్యక్తం చేశాడు. కన్నీళ్లు పెట్టుకున్న సందర్భాలు కూడా చాలా ఉన్నాయని చెప్పాడు. పూర్తి డిప్రెషన్ లో ఉన్నాడని, ఎవరినీ కలవడానికి కూడా ఇష్టపడటం లేదని తెలిపాడు.