హైదరాబాద్లో ర్యాపిడ్ టెస్టులు ప్రారంభం.. ఇక అరగంటలోనే ఫలితం
- ఆర్టీ-పీసీఆర్ టెస్టుల స్థానంలో ర్యాపిడ్ టెస్టులు
- పరీక్షల్లో పాజిటివ్ వస్తే కొవిడ్ సోకినట్టే
- తొలి రోజు మూడు జిల్లాలలో 700 మందికిపైగా పరీక్షలు
రాష్ట్రంలో ఇప్పటి వరకు రివర్స్ ట్రాన్స్క్రిప్షన్ పొలిమరేజ్ చైన్ రియాక్షన్ (ఆర్టీ-పీసీఆర్) విధానంలో కరోనా పరీక్షలు చేయగా, ఇప్పుడు ర్యాపిడ్ యాంటిజెన్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ విధానంలో తొలిసారి పాజిటివ్ ఫలితం వస్తే రెండోసారి పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉండదు. అయితే, నెగటివ్ వస్తే మాత్రం ఆర్టీ-పీసీఆర్ పరీక్ష చేయించుకుని ధ్రువీకరించుకోవాల్సి ఉంటుందని అధికారులు పేర్కొన్నారు.