పవన్ కల్యాణ్‌ ని కలవాలని రెండు మూడు సార్లు ప్రయత్నించా: శ్రీ రాపాక

Sri Rapaka comments on Pawan Kalyan
  • పవన్ అంటే నాకు క్రష్
  • కలవాలని ఉంటే ఎప్పటికైనా కలుస్తా
  • ఆయనతో డేటింగ్ కు వెళ్లడానికి కూడా రెడీ
రామ్ గోపాల్ వర్మ రూపొందించిన 'నగ్నం' (నెకెడ్) చిత్రం ఇటీవల ఓటీటీ ద్వారా విడుదలైంది. ఇందులో ప్రధాన పాత్ర పోషించిన శ్రీ రాపాక ఒక్కసారిగా పెద్ద సెలబ్రెటీ అయిపోయింది. పలు యూట్యూబ్ ఛానళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీగా మారిపోయింది. బాలయ్య చాలా మంచి మనిషని ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో చెప్పింది.

తాజాగా మరో ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, తెలుగు హీరోల్లో పవన్ కల్యాణ్ అంటే తనకు క్రష్ అని చెప్పింది. ఆయనను కలవాలని గతంలో రెండు, మూడు సార్లు ప్రయత్నించినప్పటికీ సాధ్యంకాలేదని తెలిపింది. ఆయనను కలవడానికి వేరే ఎవరినీ అడగడం తనకు ఇష్టం లేదని... ఆయనను కలవాలని ఉంటే ఎప్పటికైనా కలుస్తానని చెప్పింది. ఆయనతో డేటింగ్ కు వెళ్లడానికి కూడా తాను రెడీయేనని కీలక వ్యాఖ్యలు చేసింది.
Go Back to Shorts
Pawan Kalyan
Janasena
Sri Rapaka
Ram Gopal Varma
Naked
Tollywood

More Telugu News