బ్రెజిల్ లో కరోనా మహోగ్రరూపం... అధ్యక్షుడు బోల్సొనారోకు పాజిటివ్
- మూడో పరీక్షలో బోల్సొనారోకు కరోనా నిర్ధారణ
- మాస్కులు ఎందుకంటూ న్యాయస్థానాన్ని ఆక్షేపించిన అధ్యక్షుడు
- బ్రెజిల్ లో సామాజిక సంక్రమణం
నిత్యం వేల సంఖ్యలో కొత్త కేసులు వస్తున్న తరుణంలో అధ్యక్షుడు బోల్సొనారో వ్యవహార శైలి తీవ్ర విమర్శలపాలైంది. దేశాధ్యక్షుడైనా సరే కరోనా నివారణ కోసం మాస్కు ధరించాలని న్యాయస్థానం పేర్కొన్నా, 'అవన్నీ అర్థం లేనివి' అంటూ బోల్సొనారో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తరచుగా కరోనా టెస్టులు చేయించుకోవడం వల్ల తన ఊపిరితిత్తులు శుభ్రపడుతున్నాయంటూ వ్యంగ్యం ప్రదర్శించారు. చివరికి తానే కరోనా బారిన పడ్డారు.