తీవ్రవాదుల దాడిలో తెలంగాణ బిడ్డ ప్రాణాలు కోల్పోవడం బాధాకరం: పవన్ కల్యాణ్

  • జమ్మూ కశ్మీర్ పుల్వామా జిల్లాలో ఎన్ కౌంటర్
  • సాలిగం శ్రీనివాస్ అనే జవాను వీరమరణం
  • శ్రీనివాస్ మృతి దురదృష్టకరం అని పేర్కొన్న పవన్
జమ్మూ కశ్మీర్ లోని పుల్వామా జిల్లాలో జరిగిన ఎన్ కౌంటర్ లో తెలంగాణకు చెందిన జవాను వీరమరణం పొందాడు. దీనిపై జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ట్విట్టర్ లో స్పందించారు. పెద్దపల్లి జిల్లా నాగారం గ్రామానికి చెందిన సాలిగం శ్రీనివాస్ (28) తీవ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు. దేశం మీద ప్రేమతో సైన్యంలో చేరిన శ్రీనివాస్ చిన్నవయసులోనే అమరజీవి కావడం ఎంతో బాధ కలిగించిందని తెలిపారు.

చైనా సరిహద్దులో జరిగిన పోరాటంలో సంతోష్ బాబు అనే వీరుడ్ని కోల్పోయిన కొద్దిరోజుల వ్యవధిలోనే తెలంగాణ శ్రీనివాస్ ను కూడా కోల్పోయిందని విచారం వ్యక్తం చేశారు. బాధాతప్త హృదయంతో నివాళి అర్పిస్తున్నట్టు వివరించారు. సంతోష్ బాబు కుటుంబాన్ని ఆదుకున్న విధంగానే కేసీఆర్ సర్కారు ఇప్పుడు శ్రీనివాస్ కుటుంబానికి కూడా అండగా నిలవాలని పవన్ విజ్ఞప్తి చేశారు.  


Pawan Kalyan
Jawan
Encounter
Jammu And Kashmir

More Telugu News