తెలంగాణ రాష్ట్ర సచివాలయ కూల్చివేత పనులు ప్రారంభం.. కూలుతున్న సి-బ్లాక్
- కోర్టు తీర్పుతో ప్రభుత్వంలో జోష్
- ప్రారంభమైన సెక్రటేరియట్ భవన కూల్చివేత పనులు
- సచివాలయం వైపు వాహనాలు రాకుండా రోడ్డు మూసివేత
సచివాలయ భవనం కూల్చివేతను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను విచారించిన కోర్టు ఇటీవల ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు చెప్పింది. పాత భవనాన్ని కూల్చివేసి ఆ స్థానంలో కొత్తదాన్ని నిర్మించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కోర్టు తీర్పు నేపథ్యంలో ప్రభుత్వం వెంటనే పనులు ప్రారంభించింది. ప్రస్తుతం సచివాలయ సి-బ్లాక్‌ను కూల్చివేసే పనులు ప్రారంభించింది.