ముంబైకి నేడు అతి భారీ వర్ష సూచన.. రెడ్ అలెర్ట్ జారీ
- నిన్న కురిసిన వర్షానికి పలు ప్రాంతాలు అతలాకుతలం
- స్తంభించిన ట్రాఫిక్.. లోతట్టు ప్రాంతాలు జలమయం
- తాజా హెచ్చరికలతో ప్రభుత్వం అప్రమత్తం
హింద్మాతా, గోల్డ్ ఈవల్ సహా మరికొన్ని ప్రాంతాల్లో రోడ్లపైకి నీరు చేరడంతో ట్రాఫిక్ ఎక్కడికక్కడ నిలిచిపోయింది. మరోవైపు, పలు ప్రాంతాలో చెట్లు విరిగి విద్యుత్ స్తంభాలపై కూలడంతో కరెంటు సరఫరా నిలిచిపోయింది. నేడు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణశాఖ హెచ్చరికలతో స్పందించిన ప్రభుత్వం అత్యవసర సేవల సిబ్బందిని అప్రమత్తం చేసింది. కాగా, నిన్న ఏకధాటిగా మూడు గంటలపాటు కురిసిన వర్షానికి 157 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.