తెలంగాణలో ఒకే రోజు వెయ్యికి పైగా కరోనా కేసులు!
Add ap7am to your home Screen

తెలంగాణలో ఒకే రోజు వెయ్యికి పైగా కరోనా కేసులు!

Telangana corona cases crosses 1000 in a single day
  • 24 గంటల్లో 1,018 కేసుల నమోదు
  • ఏడుగురు రోగుల మృతి
  • 17,357కి చేరిన కేసుల సంఖ్య
తెలంగాణలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఒకే రోజు వెయ్యికి పైగా కేసులు నమోదు కావడం కలకలం రేపుతోంది. గత 24 గంటల్లో 1,018 కొత్త కేసులు నమోదయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలో 881 కేసులు నమోదు కాగా... మేడ్చల్ లో 36, రంగారెడ్డిలో 33, మహబూబ్ నగర్ లో 10, వరంగల్ రూరల్ లో 9, మంచిర్యాలలో 9, ఖమ్మంలో 7, నల్గొండలో 4, నిజామాబాద్ లో 3, సిద్ధిపేటలో 3, ఆసిఫాబాద్, మెదక్, ఆదిలాబాద్, యాదాద్రి, సంగారెడ్డి, కరీంనగర్, సూర్యాపేట, కామారెడ్డి, ములుగు, యాదాద్రి జిల్లాలలో 2 కేసుల చొప్పున కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు.

తెలంగాణలో ఒకే రోజులో వెయ్యి కేసులు దాటడం ఇది రెండోసారి. తాజా కేసులతో రాష్ట్రంలోని మొత్తం కేసుల సంఖ్య 17,357కి చేరింది. మొత్తం మరణాల సంఖ్య 267కి చేరుకుంది. రాష్ట్రంలో మొత్తం 9,008 యాక్టివ్ కేసులు ఉండగా, 8,082 మంది కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు.
Telangana
Corona Virus
Cases

More Telugu News