విజయసాయిరెడ్డితో పాటు వైవీ సుబ్బారెడ్డి, సజ్జలకు జిల్లాల బాధ్యతలు అప్పగించిన వైసీపీ అధినేత

Jagan restricted Vijayasai Reddy to North Andhra
  • పార్టీలో కీలక నేతగా చెలామణి అవుతున్న విజయసాయి 
  • శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల బాధ్యతల అప్పగింత
  • మిగిలిన జిల్లాల బాధ్యతలు వైవీ సుబ్బారెడ్డి, సజ్జలకు అప్పగింత
ఏపీలో పార్టీ కార్యకలాపాలకు సంబంధించి వివిధ జిల్లాల బాధ్యతలను వైసీపీ అధినేత జగన్ ఆయా నేతలకు అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. పార్టీలో కీలకమైన నేతగా చెలామణి అవుతున్న రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం జిల్లాల బాధ్యతలను మాత్రమే అప్పగించినట్టు సమాచారం.

ఇదే సమయంలో ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు, చిత్తూరు జిల్లాల బాధ్యతలను వైవీ సుబ్బారెడ్డికి... కడప, కర్నూలు, అనంతపురం, నెల్లూరు, ప్రకాశం జిల్లాల బాధ్యతలను సజ్జల రామకృష్ణారెడ్డికి అప్పగించారు. అలాగే తాడేపల్లిలో పార్టీ కేంద్ర కార్యాలయ బాధ్యతలను కూడా సజ్జలకు అప్పగించినట్టు తెలుస్తోంది.
Go Back to Shorts
Vijayasai Reddy
YSRCP
Jagan

More Telugu News