ముంబైకి మళ్లీ పోటెత్తుతున్న వలస కార్మికులు!
- లాక్డౌన్ తర్వాత మహారాష్ట్రను వదిలిన 18 లక్షల మంది
- లాక్డౌన్ సడలింపులతో మళ్లీ నగరానికి వస్తున్న కార్మికులు
- బీహార్, యూపీ, పశ్చిమ బెంగాల్ నుంచి పెద్ద మొత్తంలో రాక
జూన్‌కు ముందు మహారాష్ట్ర నుంచి 844 రైళ్లలో 18 మంది లక్షల మంది కార్మికులు స్వస్థలాలకు తరలిపోయారు. వారిలో ఇప్పుడు చాలా మంది తిరిగి ముంబై చేరుకుంటున్నారు. జూన్ 1 నుంచి ఇప్పటి వరకు 5 లక్షల మందికిపైగా ముంబై వచ్చినట్టు వెస్టర్న్ రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ రవీంద్ర భాకర్ తెలిపారు. ప్రత్యేక రైళ్లు నడిపినప్పుడు 70 శాతం సీట్లు మాత్రమే నిండాయని, ఇప్పుడు వందకు వందశాతం సీట్లు బుక్ అవుతున్నట్టు చెప్పారు.