‘కృష్ణ అండ్ హిజ్ లీల’ సినిమాపై సెబర్ క్రైమ్ కు ఫిర్యాదు

  • ప్రధాన పాత్రలకు హిందువుల పేర్లు పెట్టారు
  • మోతాదుకు మించిన రొమాన్స్ ను పెట్టారు
  • చిత్రాన్ని ఆపేలా చర్యలు తీసుకోండి
సురేష్ ప్రొడక్షన్స్, వయాకామ్ 18 స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం 'కృష్ణ అండ్ హిజ్ లీల'. ఈ చిత్రానికి రానా సమర్పకుడిగా వ్యవహరించారు. సిద్ధు పొన్నలగడ్డ, శ్రద్ధా శ్రీనాథ్ జంటగా నటించారు. ఈ చిత్రం ఇటీవలే నెట్ ఫ్లిక్స్ లో ఓటీటీ ప్లాట్ ఫామ్ ద్వారా విడుదలైంది. ఈ సినిమా టైటిల్, హీరో, హీరోయిన్ల పేర్లు వివాదాస్పదమయ్యాయి. ప్రధాన పాత్రలకు హిందూ దేవతల పేర్లను పెట్టారంటూ సైబర్ క్రైమ్ కు రాకేశ్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. హీరో, హీరోయిన్లకు దేవుళ్ల పేర్లను పెట్టడమే కాకుండా... వారి మధ్య మోతాదు మించిన రొమాన్స్ సన్నివేశాలను పెట్టారని ఫిర్యాదులో ఆరోపించారు. ఆ చిత్రాన్ని ఆపేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

Krishna and His Leela Movie
Tollywood
Cyber Crime

More Telugu News