నేడు కూడా.. పెట్రోలుపై 25 పైసలు, డీజిల్‌పై 21 పైసలు పెరుగుదల

petrol rates hike consecutive 21st day
  • జూన్ 7న మొదలైన పెట్రో ధరల పెంపు
  • ఇప్పటి వరకు పెట్రోలుపై రూ.9.18, డీజిల్‌పై రూ.10.27  పెంపు
  • జూన్ 1న రూ. 71గా ఉన్న పెట్రోలు ధర ఇప్పుడు రూ.80.38
దేశంలో పెట్రో ధరల పెరుగుదలకు కళ్లెం పడడం లేదు. ఈ నెల 7 ప్రారంభమైన పెట్రో బాదుడు కొనసాగుతోంది. వరుసగా 21వ రోజు కూడా ధరలు పెరిగాయి. నేడు లీటరు పెట్రోలుపై 25 పైసలు పెరగ్గా, డీజిల్‌పై 21 పైసలు పెరిగింది. ఫలితంగా ఢిల్లీలో లీటరు పెట్రోలు ధర రూ. 80.38కు చేరుకోగా, డీజిల్ ధర రూ.80.40కు పెరిగింది. తాజా పెంపుతో గత మూడు వారాల్లో డీజిల్‌పై 10.27 రూపాయలు, పెట్రోలుపై 9.18 రూపాయలు చొప్పున పెరిగాయి. జూన్ 1న  రూ.71 ఉన్న లీటరు పెట్రోలు ధర ప్రస్తుతం రూ.80.38కు చేరడం గమనార్హం.
Go Back to Shorts
petrol
Diesel
price hike

More Telugu News