Bollywood: బాలీవుడ్ కంటే దక్షిణాది సినిమాలే బెటర్: హీరోయిన్ పాయల్ ఘోష్

payal about bollywood situation
  • దక్షిణాదిలో నటించిన వారిని బాలీవుడ్‌లో చిన్నచూపు చూస్తారు
  • దక్షిణాది చిత్రాల్లోనే హీరోయిన్లను బాగా గౌరవిస్తారు
  • దక్షిణాది సినిమాల కోసం ప్రయత్నాలు జరిపితేనే బాగుంటుంది
దక్షిణాది సినిమాలతో పాటు బాలీవుడ్‌ లో నటించిన హీరోయిన్ పాయల్ ఘోష్ పలు కీలక వ్యాఖ్యలు చేసింది. దక్షిణాది సినిమాల్లో నటించిన వారిని బాలీవుడ్‌లో చిన్నచూపు చూస్తారని తెలిపింది. ఆమె తెలుగులో కొన్ని సినిమాల్లో నటించింది. అనంతరం బాలీవుడ్‌ సినిమాల్లో నటిస్తోంది.

తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... బాలీవుడ్‌తో పోల్చితే దక్షిణాది చిత్రాల్లోనే హీరోయిన్లను బాగా గౌరవిస్తారని తెలిపింది.  దక్షిణాది సినిమాల్లో నటించిన వారిని బాలీవుడ్‌లో చిన్నచూపు చూస్తుండడంతో బాలీవుడ్‌లో నటించే అవకాశం కోసం ప్రయత్నాలు జరిపే సమయంలో దక్షిణాది సినిమాల్లో నటించానన్న విషయాన్ని చెప్పొద్దని తనకు కొందరు సలహాలు ఇచ్చారని వెల్లడించింది. ఈ పరిణామాలతో బాలీవుడ్ కంటే దక్షిణాది సినిమాల కోసం ప్రయత్నాలు జరపితేనే బాగుంటుందని తనకు అనిపిస్తోందని తెలిపింది.
Bollywood
Tollywood

More Telugu News