Corona Virus: మహమ్మారి బారిన పడిన కాంగ్రెస్ సీనియర్ నేత అభిషేక్ సింఘ్వీ!

Congress Leader Abhisheik manu Singhvi Gets Corona
  • కొన్ని రోజులుగా అస్వస్థత
  • పరీక్షించగా కరోనా పాజిటివ్
  • త్వరగా కోలుకోవాలన్న లాయర్లు, నేతలు
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, సుప్రీంకోర్టు న్యాయవాది అభిషేక్ మనూ సింఘ్వి కరోనా మహమ్మారి బారిన పడ్డారు. గత కొన్ని రోజులుగా ఆయనకు అనారోగ్యంగా ఉండటంతో కరోనా పరీక్షలు చేయించుకోగా, ఈ ఉదయం పాజిటివ్ వచ్చింది. దీంతో ఆయన స్వీయ నిర్బంధంలోకి వెళ్లిపోయి చికిత్స చేయించుకోవడం ప్రారంభించారు.

కాగా, ఇటీవలి కాలంలో ఆయన్ను కలిసిన ఇతర కాంగ్రెస్ నేతలు, సుప్రీంకోర్టు న్యాయవాదులు ఇప్పుడు ఆందోళన చెందుతున్నారు. మరోపక్క, అభిషేక్ త్వరగా కోలుకోవాలని పలువురు లాయర్లు, కాంగ్రెస్ నేతలు ఆకాంక్షించారు. ఇదిలావుండగా, దేశ రాజధానిలో కరోనా విలయతాండవం చేస్తోంది. ఇప్పటికే 70 వేల మందికి పైగా వైరస్ సోకగా, 2,300కు పైగా మరణాలు సంభవించాయి.
Corona Virus
Abhisheik Manuy Singhwi
Positive
New Delhi

More Telugu News