Devineni Uma: కొవిడ్ నిబంధనలను మీరు వీటికే ఉపయోగిస్తున్నారు: దేవినేని ఉమ విమర్శలు

Jagan is using Covid rules for political vendetta says Devineni Uma
  • రాష్ట్రంలో కరోనా కేసులు 10 వేలు దాటాయి
  • ప్రజలను రక్షించేందుకు ఏం జాగ్రత్తలు తీసుకున్నారు?
  • రాజకీయ కక్షలు తీర్చుకోవడానికే వీటిని వాడుకుంటున్నారు
ముఖ్యమంత్రి వైయస్ జగన్ పై టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శలు గుప్పించారు. కరోనా రక్కసిని కట్టడి చేసేందుకు తీసుకొచ్చిన కొవిడ్ నిబంధనలను కూడా కక్ష తీర్చుకోవడానికి ఉపయోగిస్తున్నారంటూ మండిపడ్డారు. రాష్ట్రంలో కరోనా కేసులు 10 వేలను దాటాయని... ప్రజలను కరోనా నుంచి రక్షించడానికి ఏ జాగ్రత్తలు తీసుకున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు.

కొవిడ్ నిబంధనలను ప్రతిపక్ష నేతలపై కేసులు పెట్టి రాజకీయ కక్ష తీర్చుకోవడానికి, గిట్టుబాటు ధర లేని రైతులు చేస్తున్న నిరసన కార్యక్రమాలను అడ్డుకోవడానికే వినియోగిస్తున్నారని మండిపడ్డారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. దీంతో పాటు వివిధ దినపత్రికల్లో వచ్చిన కరోనా వార్తలను షేర్ చేశారు.
Devineni Uma
Telugudesam
Corona Virus
Jagan
YSRCP

More Telugu News