ఆలియా భట్ కు డేట్స్ సమస్య.. 'ఆర్ఆర్ఆర్'లో డౌటే!

Alia Bhat Talks with Rajamouli
  • లాక్ డౌన్ కారణంగా ఆగిన ఆర్ఆర్ఆర్ షూటింగ్
  • సినిమా కోసం కేటాయించిన డేట్లు ఓవర్
  • మరో ప్రాజెక్ట్ కు వెళతానని రాజమౌళిని కోరిన ఆలియా
కరోనా ఎఫెక్ట్ కారణంగా ప్రస్తుతం ముంబైలోనే ఉన్న ఆలియా భట్, రౌద్రం రణం రుధిరం (ఆర్ఆర్ఆర్)లో రామ్ చరణ్ సరసన సీత పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా సినిమా షూటింగ్ నిలిచిపోగా, పరిస్థితి ఓ కొలిక్కి రాగానే షూటింగ్ ను తిరిగి ప్రారంభించాలని రాజమౌళి భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు ఫోన్ చేసిన ఆలియా, పలు విషయాలను చర్చించినట్టు తెలుస్తోంది.

కాగా, ఈ సినిమాకు ఆలియా భట్ కేటాయించిన డేట్స్ అయిపోగా, ఈ విషయాన్ని చెప్పేందుకే ఆలియా ఫోన్ చేసినట్టు తెలుస్తోంది. తాను ఏమీ చెప్పలేని స్థితిలో ఉన్నానని రాజమౌళి వ్యాఖ్యానించగా, ఆమె తన తరువాతి ప్రాజెక్ట్ లోకి వెళతానని, అందుకు అంగీకరించాలని కోరినట్టు వార్తలు వచ్చాయి. ఇక ఈ చిత్రం షూటింగ్ లో ఆలియాకు చెందిన భాగాన్ని ఇప్పటివరకూ ఇంకా ప్రారంభించలేదు. మిగిలిన షూటింగ్ లో ఆలియావే ఎక్కువ సీన్స్ ఉన్నాయి. ఈ నేపథ్యంలో తిరిగి ఆమెనే ఒప్పించి తెస్తారా? లేదా ఎన్టీఆర్ కు హీరోయిన్ ను మార్చినట్టే రామ్ చరణ్ కు కూడా మారుస్తారా? అన్నది వేచి చూడాలి.
Go Back to Shorts
Lockdown
Alia Bhat
RRR
Rajamouli

More Telugu News