Balakrishna: బాలకృష్ణ చిత్రానికి పవర్ ఫుల్ టైటిల్!

Balakrishnas movie has been titled

  • బాలయ్య, బోయపాటి కాంబోలో మూడో చిత్రం
  • ఇటీవలే విడుదలైన మొదటి టీజర్
  • తాజాగా 'మోనార్క్' అనే టైటిల్ నిర్ణయం
  • చిత్రానికి తమన్ సంగీతం ఓ హైలైట్

బాలకృష్ణ లాంటి స్టార్ హీరో సినిమాకి టైటిల్ పవర్ ఫుల్ గా వుండాలి. అందులోనూ బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న బాలయ్య సినిమా అంటే మరీనూ. టైటిల్ అదిరిపోవాలి.. టైటిల్ ను బట్టే సినిమా ఎలా ఉంటుందన్న అంచనాకు అభిమానులు వచ్చేస్తారు. దీనిని దృష్టిలో పెట్టుకునే బోయపాటి తన సినిమాకి టైటిల్ ఫిక్స్ చేస్తుంటాడు. గతంలో బాలకృష్ణతో 'సింహా', 'లెజండ్' వంటి పవర్ ఫుల్ టైటిల్స్ తో హిట్ చిత్రాలను రూపొందించిన బోయపాటి ఇప్పుడు ఆయనతో మూడో చిత్రాన్ని చేస్తున్నారు.

ఇక ఈ చిత్రానికి ఎంతో ఆలోచించిన మీదట 'మోనార్క్' అనే టైటిల్ని ఫైనల్ చేసినట్టు తాజా సమాచారం. కథకు ఈ టైటిల్ బాగా సరిపోతుందని అందరూ సంతృప్తి చెందిన మీదట దీనిని ఫైనల్ చేశారని తెలుస్తోంది. త్వరలోనే దీనిని అధికారికంగా ప్రకటిస్తారు. ఇదిలావుంచితే, ఇటీవల బాలయ్య జన్మదినం సందర్భంగా ఈ సినిమా నుంచి విడుదల చేసిన టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ భారీ చిత్రానికి తమన్ సంగీతం ఓ హైలైట్ అవుతుందనే చెప్పచ్చు!

  • Error fetching data: Network response was not ok

More Telugu News