Tollywood: అలా లావుగా ఉండే సినీనటి ఇలా సన్నగా అయిపోయింది.. నాటి, నేటి ఫొటోలు వైరల్!

vidyullekha raman shares her photo
  • ఫొటో పోస్ట్ చేసిన హాస్యనటి విద్యుల్లేఖా రామన్
  • ఇప్పుడు  68.2 కిలోల బరువు మాత్రమే ఉన్నానన్న నటి
  • వ్యాయామంతో బరువు తగ్గానని వ్యాఖ్య
  • కష్టపడనిదే జీవితంలో ఏదీ సులువుగా రాదని సందేశం
లావుగా వుండే సినీ హాస్యనటి విద్యుల్లేఖా రామన్ ఇప్పుడు సన్నగా అయిపోయింది. అప్పటి, ఇప్పటి ఫొటోలను పోస్ట్ చేస్తూ స్వయంగా ఈ విషయాన్ని తనే పేర్కొంది. ప్రస్తుతం తాను 68.2 కిలోల బరువు మాత్రమే ఉన్నానని ఆమె తెలిపింది. వ్యాయామం, జీవన శైలి మార్చుకోవడం వల్లే తాను బరువు తగ్గానని ఆమె తెలిపింది.

తాను అధిక బరువుతో ఉన్న సమయంలో తన ఆత్మ విశ్వాసంపై అనుమానాలు వచ్చేవని, ఇప్పుడు మాత్రం పూర్తిగా కాన్ఫిడెంట్‌గా ఉన్నానని అనిపిస్తోందని ఆమె పేర్కొంది. ఇక వ్యాయామం విషయానికొస్తే, తాను వారానికి ఆరు రోజులు వర్కవుట్లు చేశానని తెలిపింది. సన్నబడటానికి కషాయాలు, మాత్రలు వంటివేమీ పనిచేయవని, కష్టపడనిదే జీవితంలో ఏదీ సులువుగా రాదని ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో సందేశమిచ్చింది.

         
Tollywood
Viral Pics

More Telugu News