Amrutha: ప్రణయ్, అమృత కథతో ఇంకో సినిమా.. విడుదలకు సిద్ధం!

Another movie finished shooting with the story of Amrutha and Pranay
  • మిర్యాలగూడ పరువుహత్య కథాంశంతో వర్మ 'మర్డర్' సినిమా
  • ఇదే కథతో తెరకెక్కిన 'అన్నపూర్ణమ్మగారి మనవడు' చిత్రం
  • కీలక పాత్రల్లో బాలాదిత్య, అర్చన, బెనర్జీ
అమృత, ప్రణయ్, మారుతీరావుల కథాంశంతో వివాదాస్పద సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 'మర్డర్' అనే సినిమాను తెరకెక్కించిన సంగతి తెలిసిందే. వర్మ నుంచి ఈ సినిమాకు సంబంధించిన ప్రకటన వెలువడగానే పెద్ద చర్చ మొదలైంది. వర్మపై అమృత తీవ్ర వ్యాఖ్యలు చేసినట్టు కూడా వార్తలు వచ్చాయి. అయితే, ఈ అంశంపై అమృత ఎలాటి వ్యాఖ్యలు చేయలేదని ఆమె మామయ్య చెప్పడం కూడా గమనార్హం. ఈ తరుణంలో మరో ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది.

ఇదే మిర్యాలగూడ పరువుహత్య కథాంశంగా ఇప్పటికే 'అన్నపూర్ణమ్మగారి మనవడు' పేరుతో ఓ చిత్రం తెరకెక్కింది. ఈ చిత్రంలో నటీనటులుగా అర్చన, బాలాదిత్య నటించగా.. అమృత తండ్రి మారుతీరావు పాత్రను బెనర్జీ పోషించారు. ఈ సినిమాను తెరకెక్కించిన దర్శకుడు నర్రా శివనాగేశ్వరరావు (శివనాగు) ఈ సందర్భంగా మాట్లాడుతూ, మారుతీరావు పాత్రలో బెనర్జీ అద్భుతంగా నటించారని కితాబిచ్చారు. ఈ చిత్రంలో జమున, అన్నపూర్ణ కీలక పాత్రలు పోషించారని చెప్పారు. నిర్మాత ఎంఎన్ఆర్ చౌదరి మాట్లాడుతూ కూతుర్ని తనకు కాకుండా చేశాడనే కోపంతో ఆమె భర్తను హతమార్చే సన్నివేశాలను దర్శకుడు అద్భుతంగా తెరకెక్కించాని ప్రశంసించారు.
Amrutha
Pranay
Maruti Rao
Movie
Ram Gopal Varma
Murder
Annapurnamma Gari Manavadu Movie
Tollywood

More Telugu News