తన ఆరోగ్యం పట్ల బండ్ల గణేశ్ ట్వీట్
- కరోనా వైరస్ బారిన పడ్డ బండ్ల గణేశ్
- కంగారు పడుతున్న అభిమానులు
- తన ఆరోగ్య పరిస్థితి బాగుందన్న గణేశ్
ఈ నేపథ్యంలో ఆయన ఆరోగ్య పరిస్థితిపై అభిమానులు కంగారు పడుతున్నారు. సోషల్ మీడియా ద్వారా ఆరోగ్య సమాచారాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. ఈ క్రమంలో అభిమానుల ప్రశ్నలకు బండ్ల గణేశ్ ఓపికగా సమాధానమిస్తున్నారు. ప్రస్తుతం తన ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు.