'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు ఇయాన్ హోల్మ్ కన్నుమూత!
- కొంతకాలంగా పార్కిన్సన్స్ వ్యాధి
- ఆసుపత్రిలో కన్నుమూసిన ఇయాన్
- సంతాపం తెలిపిన హాలీవుడ్
ఆయన చివరిగా 2014లో వచ్చిన 'ది హాబిట్: ది బ్యాటిల్ ఆఫ్ ది ఫైవ్ ఆర్మీస్' చిత్రంలో కనిపించారు. గత కొంతకాలంగా పార్కిన్సన్స్ వ్యాధితో ఆయన బాధపడుతూ కన్నుమూశారని ఆయన ప్రతినిధి వెల్లడించారు. ఆసుపత్రిలో కుటుంబీకులందరి మధ్యా ప్రశాంతంగా ఆయన తుది శ్వాసను విడిచారని చెప్పారు. ఇయాన్ మరణం హాలీవుడ్ కు తీరని లోటని పలువురు నటీ నటులు సంతాపాన్ని వెల్లడించారు.