భ్రాంతిలో మునిగి తేలుతున్న చంద్రబాబు: విజయసాయి సెటైర్లు
Add ap7am to your home Screen

భ్రాంతిలో మునిగి తేలుతున్న చంద్రబాబు: విజయసాయి సెటైర్లు

Vijayasai Reddy Setires on Chandrababu
  • కేసుల్లో అరెస్టయితే హక్కులకు భంగమా?
  • తాత్కాలిక ఆనందం పొందుతున్న చంద్రబాబు
  • ట్విట్టర్ లో విజయసాయి రెడ్డి
పలు కేసుల్లో ఇరుక్కుని అరెస్టయిన వ్యక్తుల హక్కులకు భంగం ఎలా కలిగిందో చంద్రబాబు నాయుడు చెప్పాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ప్రశ్నించారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్లు పెట్టారాయన.

"తమ పార్టీ నేతలు వందల కోట్ల కుంభకోణాలు, ఫోర్జరీ, మోసం కేసుల్లో అరెస్టయితే సిగ్గు పడాల్సింది పోయి, మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేస్తామని బెదిరిస్తున్నారు నాయుడు బాబు. స్వార్థ బుద్ధితో నేరాలకు పాల్పడి కేసుల్లో ఇరుక్కున్న వారికి హక్కుల భంగం ఎలా కలిగిందో ప్రజలకు జవాబు చెప్పాలి" అన్నారు.

ఆపై "సమాంతర పాలన భ్రాంతిలో బాబు గారు మునిగి తేలుతున్నారు. ద్రవ్య వినిమయ బిల్లును కౌన్సిల్ లో అడ్డుకోవడం ద్వారా తాత్కాలిక ఆనందం పొందారు. ఇలాంటి ఉపశమనాలతో బండి లాక్కొస్తున్నారు. వీడియోలు తీసి సభా మర్యాదలు ఉల్లంఘించిన కుమారుడు విప్లవ యోధుడిలా కనిపించి ఉంటాడు. ప్రజలు ఛీ కొడుతున్నా!" అని సెటైర్లు వేశారు.
Chandrababu
Twitter
Vijay Sai Reddy

More Telugu News