Jagan: రాజ్యసభ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకున్న సీఎం జగన్

jagan casts vote
షార్ట్స్‌లో చూడండి
ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన నాలుగు రాజ్యసభ స్థానాలకు వెలగపూడిలోని అసెంబ్లీ హాలులో పోలింగ్ జరుగుతోంది. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఓటు హక్కును వినియోగించుకున్నట్లు వైసీపీ తెలిపింది. ఈ ఎన్నికల్లో వైసీపీ నుంచి ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌, పరిమళ్‌ నత్వానీ, మోపిదేవి వెంకటరమణ, టీడీపీ నుంచి వర్ల రామయ్య పోటీ చేస్తున్నారు.

ఇప్పటికే పలువురు వైసీపీ ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ రోజు మధ్యాహ్నం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడితో పాటు ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈ రోజు సాయంత్రం ఎన్నికల ఫలితాలు వెల్లడవుతాయి.
Go Back to Shorts
Jagan
YSRCP
Andhra Pradesh

More Telugu News