ప్రతి దానికి కులానికి లింకుపెట్టే చంద్రబాబూ, ఈ అంకెలు చూడు!: విజయసాయిరెడ్డి
Add ap7am to your home Screen

ప్రతి దానికి కులానికి లింకుపెట్టే చంద్రబాబూ, ఈ అంకెలు చూడు!: విజయసాయిరెడ్డి

vijaya sai reddy fires on chandra babu naidu
  • బీసీ, ఎస్‌సీ, ఎస్టీ, మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడ్డది  
  • బడ్జెట్ కేటాయింపుల్లో బీసీలకు 68.18 శాతం
  • కాపులకు 42.35 శాతం
  • మైనార్టీలకు 116 శాతం పెంచారు
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. 'ప్రతి దానికి కులానికి లింకుపెట్టే చంద్రబాబు నాయుడు ఈ అంకెలు చూడు అర్థమవుతుంది. బీసీ, ఎస్‌సీ, ఎస్టీ, మైనార్టీల సంక్షేమానికి సీఎం వైఎస్‌ జగన్ గారి‌ ప్రభుత్వం కట్టుబడ్డది. కులాలను రెచ్చగొట్టి, ఆ హింసాగ్నిలో చలి కాచుకునే చరిత్ర చంద్రబాబుదే. బడ్జెట్ కేటాయింపుల్లో బీసీలకు 68.18 శాతం, కాపులకు 42.35 శాతం, మైనార్టీలకు 116 శాతం పెంచారు' అని ఆయన వివరించారు. కాగా, నిన్న అసెంబ్లీలో ఏపీ ప్రభుత్వం బడ్జెట్‌ ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే.
Vijay Sai Reddy
Chandrababu
Andhra Pradesh

More Telugu News