రాడ్లతో కొట్టి మురికి నీళ్లు తాగించారు... భారత దౌత్య సిబ్బందికి పాక్ లో చిత్రహింసలు
- పాకిస్థాన్ లో నిన్న హైడ్రామా
- కనిపించకుండాపోయిన ఇద్దరు భారత దౌత్య సిబ్బంది
- 12 గంటల తర్వాత వారిని విడిచిపెట్టిన పాక్ భద్రతా బలగాలు
కాగా, ఆ ఇద్దరు ఉద్యోగులను గంటల పాటు తమ అదుపులో ఉంచుకున్న భద్రతా బలగాలు వారిని చిత్రహింసలకు గురిచేశాయి. ఇనుపరాడ్లతో, కర్రలతో కొట్టడమే కాకుండా, మురికి నీళ్లు తాగించినట్టు తెలిసింది. చివరికి రాత్రి 9 గంటల సమయంలో వారిని భారత హైకమిషన్ కు అప్పగించారు. కాగా, దీనిపై పాక్ మీడియాలో భిన్న కథనాలు వచ్చాయి. భారత హైకమిషన్ ఉద్యోగులు ఓ రోడ్డు ప్రమాదానికి కారకులు కావడంతో వారిని పోలీసులు అరెస్ట్ చేసినట్టు వక్రభాష్యం చెప్పాయి.