షోఫియాన్లో భారీ ఎన్కౌంటర్.. ముగ్గురు ఉగ్రవాదుల హతం
- జమ్మూకశ్మీర్లో కొనసాగుతున్న ఉగ్రవాదుల ఏరివేత
- 10 రోజుల్లో 19 మందిని హతమార్చిన సైన్యం
- ఘటనా స్థలం నుంచి ఏకే 47, ఇన్సాస్ రైఫిళ్లు స్వాధీనం
గమనించిన ఉగ్రవాదులు భద్రతా దళాలపై కాల్పులు ప్రారంభించారు. అప్రమత్తమైన భద్రతా దళాలు ఎదురుకాల్పులు ప్రారంభించాయి. ఈ ఘటనలో ముగ్గురు ఉగ్రవాదులు హతమైనట్టు సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. ఎన్కౌంటర్ ప్రాంతం నుంచి ఏకే-47, ఇన్సాస్ రైఫిళ్లను స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. కాగా, గత 10 రోజుల్లో 19 మంది ఉగ్రవాదులను భద్రతా దళాలు హతమార్చాయి.