సుశాంత్!.. ఇంకెప్పుడూ ఇలా చేయను: కరణ్ జొహార్ భావోద్వేగం
- ఏడాదిగా టచ్ లో లేను
- ఓ స్నేహితుడి ఓదార్పు అతనికి అవసరం
- ఆ విషయాన్ని గుర్తించి కూడా లోతుగా వెళ్లలేకపోయాను
- సుశాంత్ వి కల్మషం లేని నవ్వులు
ఈ మేరకు తన ఇన్ స్టాగ్రామ్ లో ఓ పోస్ట్ పెట్టిన కరణ్ జొహార్, తనను తాను నిందించుకున్నారు. మనుషుల మధ్య సంబంధాలను మరింతగా పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అభిప్రాయపడ్డారు. సుశాంత్ వి కల్మషం లేని నవ్వులని, ఆయన ఆత్మీయ ఆలింగనాలను తాను ఇప్పుడు కోల్పోయానని అన్నారు. కాగా, కరణ్ నిర్మించిన 'డ్రైవ్'లో సుశాంత్ నటించిన సంగతి తెలిసిందే.