విజయవాడ గ్యాంగ్ వార్: ప్రధాన నిందితుడు పండు అరెస్ట్... ఆయుధాలు స్వాధీనం
- విజయవాడలో గ్యాంగ్ వార్ తో ఓ యువకుడి మృతి
- ఇప్పటివరకు 33 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు
- అరెస్టయిన పండును కోర్టులో హాజరు పర్చిన పోలీసులు
- కోర్టు ఆదేశాలతో రాజమండ్రి జైలుకు తరలింపు
ఈ రోజు పండును కోర్టులో హాజరుపర్చారు. అనంతరం న్యాయమూర్తి ఆదేశాలతో రాజమండ్రి కేంద్ర కారాగారానికి తరలించారు. కాగా, ఈ కేసులో ఇప్పటివరకు 33 మందిని అరెస్ట్ చేశారు. వారిలో సందీప్, పండు గ్యాంగులకు చెందిన సభ్యులున్నారు. మరో 15 మంది పరారీలో ఉండగా, వారి కోసం 6 పోలీసు బృందాలు ముమ్మరంగా గాలింపు జరుపుతున్నాయి.