దెయ్యం వ్యాయామం చేస్తోందంటూ వీడియో... అసలు విషయం తేల్చిన పోలీసులు
- దానంతట అదే కదులుతున్న ఓపెన్ జిమ్ పరికరం
- సోషల్ మీడియాలో వీడియో వైరల్
- గ్రీజు పూసిన పరికరాన్ని వేగంగా ఊపినట్టు గుర్తించిన పోలీసులు
భుజబలం పెంపొందించుకునేందుకు ఉపయోగించే ఆ జిమ్ పరికరానికి ఎక్కువమోతాదులో గ్రీజును పూసి, దాన్ని వేగంగా కదిపి వీడియో చిత్రీకరించారని పోలీసులు గుర్తించారు. ఇది ఆకతాయిల పనే అని, పరికరానికి గ్రీజు ఎక్కువ పూస్తే దాని కదలికల్లో వేగం పెరుగుతుందని ఝాన్సీ పోలీసులు వెల్లడించారు. అంతేకాదు, పోలీసులు కూడా గ్రీజు పూసి ఈ పరికరాన్ని పరీక్షించి చూశారు.