ప్రముఖ సినిమా కెమెరామెన్ కన్నన్ మృతి

  • గుండె సంబంధ సమస్యలతో కన్నుమూసిన కన్నన్
  • ఆయన వయసు 69 ఏళ్లు
  • చెన్నైలో రేపు అంత్యక్రియలు
ప్రముఖ సినీ కెమెరామెన్ బి.కన్నన్ తుదిశ్వాస విడిచారు. గుండె సంబంధ సమస్యలతో చెన్నైలో ఆయన కన్నుమూశారు. ఆయన వయసు 69 ఏళ్లు. తమిళం, మలయాళంలో 50కి పైగా సినిమాలకు ఆయన పని చేశారు. ప్రముఖ దర్శకుడు భారతీరాజాతో కన్నన్ కు మంచి అనుబంధం ఉంది. ఆయనతో కలిసి 40 సినిమాలకు పని చేశారు.

కన్నన్ మృతితో చిత్ర పరిశ్రమలో ఆవేదన నెలకొంది. ఒక మంచి వ్యక్తిని కోల్పోయామంటూ సినీ ప్రముఖులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సాయంత్రం 6 గంటలకు ఆయన పార్థివదేహాన్ని అల్వార్ పేటలోని ఆయన నివాసం వద్ద ఉంచుతారు. రేపు అంత్యక్రియలను నిర్వహిస్తారు. కన్నన్ కు భార్య, ఇద్దరు కుమార్తెలున్నారు.

Cinematographer
Kannan
Death

More Telugu News