Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అచ్చెన్నాయుడికి అవసరమైతే మరోసారి ఆపరేషన్ చేస్తాం!: జీజీహెచ్ సూపరింటెండెంట్

health bulletin on atchannidu health
  • అచ్చెన్నాయుడికైన గాయానికి చికిత్స అందిస్తున్నాం
  • గాయం తగ్గడానికి 3 రోజులు పట్టవచ్చు
  • బీపీకి ప్రస్తుతం వాడుతున్న మందులనే కొనసాగిస్తున్నాం
టీడీపీ నేత అచ్చెన్నాయుడిని అరెస్టు చేసిన అనంతరం అధికారులతో కలిసి ఆయన సుదీర్ఘ ప్రయాణం చేయడంతో ఆయనకు గతంలో జరిగిన ఆపరేషన్ గాయం పచ్చిగా మారిందని జీజీహెచ్ సూపరింటెండెంట్ సుధాకర్ చెప్పారు. ఆయన ఆరోగ్యంపై తాజాగా హెల్త్‌ బులిటెన్ విడుదలయింది. అచ్చెన్నాయుడికైన గాయానికి చికిత్స అందిస్తున్నామని వివరించారు.

ఆయనకు అవసరమైతే మరోసారి ఆపరేషన్ చేస్తామని తెలిపారు. ఆయనకైన గాయం తగ్గడానికి 3 రోజులు పట్టవచ్చని ఆయన చెప్పారు. బీపీకి ప్రస్తుతం వాడుతున్న మందులనే కొనసాగిస్తున్నామని వివరించారు. అలాగే ఆయనకు షుగర్ లెవల్స్‌ సాధారణంగానే ఉన్నాయని చెప్పారు.
Atchannaidu
Telugudesam
ESI Scam

More Telugu News