దొరకకుండా దాక్కోవడానికి తండ్రీకొడుకులు కొత్త ప్రదేశాన్ని వెతుక్కుంటున్నారు: విజయసాయిరెడ్డి

The father son duo believed that Hyderabad would be the safest shelter during lockdown Now they are looking for a new bolthole
  • చంద్రబాబు, లోకేశ్‌పై పరోక్షంగా విమర్శలు
  • లాక్‌డౌన్‌లో తండ్రీకొడుకులు హైదరాబాద్‌లో ఉన్నారు
  • ఆ ప్రాంతమే సురక్షితమైందని భావించారు
టీడీపీ నేత అచ్చెన్నాయుడిని ఏసీబీ అధికారులు అరెస్టు చేసి తీసుకెళ్లిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దర్యాప్తు బృందాలకు దొరకకుండా ఉండేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు నారా లోకేశ్‌ ప్రయత్నాలు జరుపుతున్నారంటూ వారి పేర్లను ప్రస్తావించకుండా వైసీపీ నేత విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు. 'లాక్‌డౌన్‌లో ఈ తండ్రీకొడుకులు హైదరాబాదే సురక్షితమైన ప్రాంతమని భావించారు. ఇప్పుడు దర్యాప్తు బృందాలకు దొరకకుండా ఉండేందుకు దాక్కోవడానికి వారిద్దరు కొత్త ప్రదేశాన్ని వెతుక్కుంటున్నారు'  అని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.
Go Back to Shorts
Vijay Sai Reddy
YSRCP
Andhra Pradesh

More Telugu News