స్టేడియాల్లోకి 25 శాతం ప్రేక్షకులను అనుమతించాలని ఆస్ట్రేలియా నిర్ణయం
- ఆస్ట్రేలియాలో అదుపులోకి వస్తున్న కరోనా
- ఆంక్షలు సడలించాలని ప్రభుత్వ నిర్ణయం
- త్వరలో క్రీడాపోటీల నిర్వహణకు మార్గదర్శకాలు
ప్రస్తుతం దేశంలో ఆశాజనక పరిస్థితులు కనిపిస్తుండడంతో కరోనా ఆంక్షలు క్రమంగా సడలించాలని ప్రధాని స్కాట్ మోరిసన్ భావిస్తున్నారు. ముఖ్యంగా, క్రీడారంగంపై కఠిన నిబంధనలు తొలగించాలని యోచిస్తున్నారు. ఇకపై స్టేడియాల్లోకి 25 శాతం ప్రేక్షకులను అనుమతించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ నిబంధన ద్వారా 40 వేల సీటింగ్ కెపాసిటీ ఉన్న స్టేడియంలో 10 వేల మందిని అనుమతిస్తారు. అంతేకాదు, గ్యాలరీలు, స్టాండ్స్ లో సీట్ల మధ్య తగినంత దూరం ఉండాలని స్పష్టం చేశారు. త్వరలో వైద్య, ఆరోగ్య నిపుణులతో సంప్రదించి, వివిధ క్రీడా పోటీల్లో అనుసరించాల్సిన మార్గదర్శకాలను రూపొందిస్తామని ప్రధాని వెల్లడించారు.